సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలి : డీకే అరుణ

మదనాపురం వెలుగు : ఆరు గ్యారంటీల హామీలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మహబూబ్​నగర్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపునిచ్చారు. మదనాపురంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో డీకే అరుణ మాట్లాడారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బీజేపీకి పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు వంశీచంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాలమూరుకు ఏం చేశారని నిలదీశారు. పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, దేవరకద్ర ఇన్​చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి. మాధవరెడ్డి. మండల పార్టీ అధ్యక్షుడు  రామకృష్ణారెడ్డి, బాబు గౌడ్, రాజశేఖర్ యాదవ్, నవీన్ కుమార్, కురువ నాగరాజు, కొండ వెంకటేశ్​ పాల్గొన్నారు.