ఔటర్ రింగు రోడ్డు టెండర్లపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఔటర్ రింగు రోడ్డు టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఓఆర్ఆర్ పై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. సభ్యుల ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్ల లీజుపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తామని, త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని అన్నారు. 

ఓఆర్ఆర్ పై జరపాలని హరీష్ రావు కోరడం అభినందనీయమని అన్నారు.  ఓఆర్ఆర్ టెండర్లను ఎన్నికలకు హడావిడిగా, అప్పణంగా తక్కువ  కట్టబెట్టారని విమర్శించారు. రూల్స్ లేకుండా హడావిడిగా అప్పనంగా ఎవరికో కట్టబెట్టారని, దేశం విడిచి పారిపోవాలనే ఓఆర్ఆర్ టెండర్లను అమ్ముకున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

అయితే ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు ఆదేశించడంపై తమకు అభ్యంతరం లేదని, ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని హరీష్ రావు కోరారు.