మోడీనైనా..కేడీనైనా ఎదిరిస్తా : సీఎం రేవంత్

రాష్ట్రానికి సహకరించకుంటే మోడీనైనా కేడీనైనా ఎదిరిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు సభలో మాట్లాడిన రేవంత్ రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని ప్రధాని మోదీని బహిరంగంగానే అడిగా..సహకరించకపోతే  సాకిరేవు కాడ ఉతికి ఆరేస్తానని హెచ్చరించారు. పాలమూరును దేశంలోనే ఆదర్శంగా నిలుపుతానని చెప్పారు రేవంత్. 3 నెల్లల్లో 30 వేల ఉద్యోగాలిచ్చామని.. మార్చి 11న ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని చెప్పారు రేవంత్. 

పాలమూరు బిడ్డ బుర్గుల రామకృష్ణను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  కార్యకర్తలే తనకు  ముఖ్యం..వాళ్లే  శాశ్వతమన్నారు.  4 కోట్ల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు రేవంత్. మాటతప్పని..మడిమె తిప్పని నాయకురాలు తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ రాక్షసుడు, దుష్టుడు రాష్ట్రాన్ని నాశనం చేసిండని మండిపడ్డారు. డిసెంబర్ 3న తెలంగాణకు పట్టిన చీడ విరగడయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాతముత్తాతల పేర్లు చెప్పుకుని  సీఎం కుర్చీలో కూర్చోలేదన్నారు.  మిడ్జిల్ జెడ్పీటీసీగా  ప్రయాణం మొదలు పెట్టి..ఒక్కో మెట్టు ఎదిగి సీఎం అయ్యానని చెప్పారు . ఈ మొక్కను పెంచి పోషించింది మాత్రం కొడంగల్ ప్రజలేనన్నారు. 

ALSO READ :- ఎవడైనా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అంతు చూస్తా: సీఎం రేవంత్ రెడ్డి