ఆ నలుగురు ప్రభుత్వ విప్లే నాకు కళ్లు, చెవులు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ విప్ లే తనకు కళ్లు,చెవులని.. నలుగురు విప్ లు బలహీన వర్గాల వారేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోకాపేటలో దొడ్డి కుమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం.. ఈ కురుమ భవనం విద్యాకు వేదికగా కావాలని సూచించారు.  కురుమలు విద్య,ఉద్యోగ రంగాల్లో ఉన్నతంగా ఎదగాలన్నారు.

 కురుమ సోదరులకు రాజకీయ ప్రాతినిథ్యం పెంచుతామని చెప్పారు సీఎం రేవంత్. కురుమలు పోటీ చేస్తే గెలిపించుకోవాలని సూచించారు. కురుమలకు టికెట్ ఇస్తే గెలుస్తారనే నమ్మకం పార్టీలకు కలగాలన్నారు రేవంత్.   కర్ణాటకలో ఓ కురుమ నేత ఇవాళ సీఎంగా ఉన్నారు.. సామాజిక న్యాయం జరగాలంటే మీ వర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పారు. 

ALSO READ | రోడ్డు విస్తరణ.. జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్

దొరల పెత్తనాన్ని అణిచేందుకు దొడ్డి కొమురయ్య  పోరు చేశారనిచెప్పారు.  వెట్టిచాకిరీ విముక్తి కోసం దొడ్డి కొమురయ్య పోరాడారని తెలిపారు.  తమ ప్రభుత్వం ఏం చేసినా బలహీన వర్గాల కోసమే చేస్తుందన్నారు. సెక్రటేరియట్ లో బహుజనుల తల్లిని నెలకొల్పామన్నారు రేవంత్.  దాదాపు 98 శాత కులగణన పూర్తయింది.. తెలంగాణ మెగా హెల్త్ చెకప్ దాదాపు పూర్తయిందన్నారు సీఎం రేవంత్.