సీఎం ఫొటోకు క్షీరాభిషేకం 

కందనూలు, వెలుగు: బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు కాంగ్రెస్ మండల నాయకులు, రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల కోడ్ తో మిగిలిపోయిన రైతుల ఖాతాల్లో సోమవారం రాత్రి రైతుబంధు నగదును సీఎం రేవంత్ రెడ్డి జమ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు రవి 3లక్షల ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దె రాములు,గంగనమోని తిరుపతయ్య, గోవింద్ నాయక్,కత్తె ఈశ్వర్, ముక్తార్, తదితరులు పాల్గొన్నారు.