పనికి ఆహార పథకానికి మెదక్ చర్చ్ నిర్మాణం స్ఫూర్తి: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్

మెదక్: సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చ్ను సీఎం, మంత్రులు సందర్శించారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం, మంత్రులు పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చ్ ఆవరణలో అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. వందేళ్ల చరిత్ర ఉన్న మెదక్ చర్చ్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ చెప్పారు.

పీసీసీ చీఫ్ గా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పానని, అన్నట్టుగానే రాష్ట్రంలో ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని సీఎం గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది  దళిత క్రైస్తవులే ఉన్నారని సీఎం రేవంత్ వెల్లడించారు. 

ALSO READ | అసెంబ్లీలో అల్లు అర్జున్ టాపిక్ గంట సేపు అవసరమా..? పట్నం నరేందర్

వందేళ్ల క్రితం కరువుకాటకాలు నిర్మూలించడానికి మెదక్ చర్చ్ నిర్మించారని, పనికి ఆహార పథకానికి మెదక్ చర్చ్ నిర్మాణం స్ఫూర్తి అని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది మళ్లీ ఈ చర్చికి వస్తానని, తమ ప్రజా ప్రభుత్వాన్ని దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.