ORR టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. బుధవారం (ఫిబ్రవరి 28) హెచ్ ఎమ్ డీఎం భవన్ లో నిర్వహించిన రివ్యూలో అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని.. దీనిపై సమగ్ర నివేదిక హెచ్ ఎం డీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రాపాలిని ఆదేశించారు.  సీబీఐ  లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అవసరమైతే బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

బుధవారం (ఫిబ్రవరి 28) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ అధికారులతో  సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో రెరా కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలకు ఉపక్రమించారు. బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కేసులో దాదాపు 500 కోట్ల అవినీతి బయటపడింది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.