అమరులపై చరిత్ర నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోంది.. బుక్ ఫెయిర్లో సీఎం రేవంత్ రెడ్డి

అమరులపై చరిత్ర నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని, ఎక్కడ అధిపత్యం, దోపిడీ ఉంటుందో దానిపై తిరగబడే స్వభావమే తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలా చెప్పేలా చేసింది పుస్తకాలు మాత్రమేనని అన్నారు.    హైదరాబాద్ లోని కళాభారతి (ఎన్టీఆర్‌‌ స్టేడియం)లో డిసెంబర్‌‌ 19 నుంచి 29 వరకు  నిర్వహించనున్న 37వ హైదరాబాద్‌‌ బుక్‌‌ ఫెయిర్‌ ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పుస్తక పఠనం మరుగున పడుతున్న సమయంలో బుక్ ఫెయిర్ వచ్చిందని, భవిష్యత్ కు అదే దిక్సూచి అని అన్నారు.  

ఇటువంటి వాటికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. హైదరాబాద్ బుక్ఫెయిర్కు శాస్వత కార్యాలయం, ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.సమాజం ప్రజాపోరాటలు చేసేలా ప్రోత్సహించిన కళాకారుల పేర్లు వేదికలకు పెట్టడం అభినందనీయమని కొనియాడారు.   తెలంగాణలో గత పదేళ్ళుగా కన్పించిన చరిత్ర అంతా అబద్ధమని అన్నారు.

ALSO READ | నువ్వు డిప్యూటీ లీడర్ వా? హరీశ్ రావుపై మంత్రి కోమడిరెడ్డి ఫైర్
రోజూ కనీసం అరగంటైనా పుస్తకాలు చదవండి : మంత్రి జూపల్లి
- సమాజాన్ని చైతన్య చేసేది పుస్తకమేనని,  సంస్కృతి ధ్వంసం కావడానికి కారణం పుస్తక పఠనం తగ్గిపోవడమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. - పుస్తక పఠనం వల్ల వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని, రోజుకు కనీసం అరగంటైనా పుస్తకాలు చదవండని యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. 
విద్యార్థులు అందరూ కచ్చితంగా పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తాం : మంత్రిపొన్నం ప్రభాకర్
- రానున్న కాలంలో బుక్ ఫెయిర్ మరింత ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రోత్సహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  జ్ణానం అబిడ్స్ సెంటర్ లో దొరికేది కాదని, పుస్తకాలు చదివితే వస్తుందని అన్నారు. 
-