ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్, కేటీఆర్ బుద్ది మారలే: సీఎం రేవంత్రెడ్డి

కల్వకుర్తి అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తామన్నారు. రోడ్లకోసం 180 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మాడ్గుల మండలాన్ని అన్ని విధాన్న అభివృద్ధి చేస్తామన్నారు. దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర  ఉందన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి బిల్ పాస్ చేయాలన్న ఆలోచన జైపాల్ రెడ్డి ఇచ్చిందేనన్నారు. అప్పటి స్పీకర్ కు జైపాల్ రెడ్డి చేసిన సూచనమేరకు పార్లమెంట్ లో తలుపులు మూయించి, లైవ్ కట్ చేసి బిల్ పాస్ చేశారని అన్నారు. జైపాల్ రెడ్డి అధికారం ఉన్నా లేకుండా  నమ్మిన సిద్ధాంతం వీడలేదన్నారు. 

కల్వకుర్తి నియోజక వర్గం అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  గ్రామాలు, అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు.. జిల్లా కేంద్రంనుంచి రాష్ట్ర కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వెల్దండ మండలంలోని తాండ్రా పాఠశాల  అభివృద్దికి 5కోట్లు రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ముచ్చర్లలో ఆగస్టు 1న స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. వందకోట్లతో వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

రాష్ట్రంలో పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే కష్టాలు వచ్చాయన్నారు. అధికారం కోల్పోయిన బాధ కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కన్పిస్తుందన్నారు. ప్రజలు చీకొట్టిన కేసీఆర్, కేటీఆర్ కు బుద్ది మారలేదన్నారు. మా ఎన్నికలు అయిపోయాయి.. వచ్చేవి కార్యకర్తల ఎన్నికలు అని సీఎంరేవంత్ రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఊరుకు తిరిగి మా కార్యకర్తలను గెలిపిస్తామన్నారు.