అరాంఘర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి హాజరయ్యారు.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌డీపీ)లో భాగంగా ఆరాంఘర్ నుంచి జూపార్క్‌‌‌‌ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్​పనులు 2021లో ప్రారంభమైనప్పటికీ పలు కారణాల వల్ల ప్రారంభానికి జాప్యం జరుగుతూ వచ్చింది. దీని అంచనా వ్యయం రూ.636.80 కోట్లు అయినప్పటికీ పనులు పూర్తయ్యే సరికి ఖర్చు రూ.799 కోట్లకు చేరింది. ఈ ఫ్లైఓవర్ ను 24 మీటర్ల వెడల్పు, ఆరు లేన్లతో 4.08 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. 

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్, మహబూబ్‌‌‌‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరుకు రాకపోకలు సాఫీగా సాగుతాయి. అలాగే ప్రస్తుతమున్న తాడ్​బన్, దానమ్మహట్స్, హసన్ నగర్ జంక్షన్ల లోని ట్రాఫిక్ సిగ్నళ్లు వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలుంటుంది. జూపార్క్‌‌‌‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవడంతోపాటు, సమయం ఆదా కానుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్​లో నిర్మించిన అత్యధిక పొడవైన ఫ్లైఓవర్ గా దీన్ని చెప్పవచ్చు. 

ALSO READ | కేసీఆర్‎కు రైతు భరోసా ఇస్తం: మంత్రి పొంగులేటి

ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు ఎక్స్‌‌‌‌ప్రెస్ వే 2009 లో అందుబాటులోకి వచ్చింది. ఇది11.66 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో నిర్మించారు. అప్పట్లో ఎయిర్ పోర్టుకి వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు దీన్ని ఫ్లైఓవర్ ని నిర్మించారు. ఆ తరువాత 3 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో కొత్తగూడ ఫ్లైఓవర్ నిర్మించారు. అయితే ఇప్పుడు ఆరాంఘర్ ఫ్లైఓవర్  4.08 కిలోమీటర్ల పొడవుతో 6లేన్లలో అందుబాటులో వస్తుంది. ప్రస్తుతం సిటీలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ ఇదే.