బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి : సీఎం రేవంత్

బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  కేటీఆర్,హరీశ్ లను చూస్తే బిల్లారంగాల అనిపిస్తుందన్నారు. హరీశ్ రావు ఆరు అడుగులు పెరిగిండు కానీ.. మెదడు పెరగలేదని విమర్శించారు.  పాలమూరు ప్రజాదీవెన సభలో మాట్లాడిన ఆయన..పదేళ్లు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   పాలమూరు కోసం బీఆర్ఎస్  చేసిందేమి లేదన్నారు.  కుర్చేసుకుని.. కాదు కేసీఆర్  మందేసుకుని ఫామ్ హౌస్ లో పండుకున్నాడని మండిపడ్డారు. చాపల  పులుసు తిని  ఏపీకి నీళ్లు దారాత్తం చేశారని ఆరోపించారు. 

పాలమూరులో రెండు ఎంపీ సీట్లను గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కృషి చేయాలన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. 

ALSO READ :- మోడీనైనా..కేడీనైనా ఎదిరిస్తా : సీఎం రేవంత్

పాలమూరు బిడ్డ బుర్గుల రామకృష్ణను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  కార్యకర్తలే తనకు  ముఖ్యం..వాళ్లే  శాశ్వతమన్నారు.  4 కోట్ల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు రేవంత్. మాటతప్పని..మడిమె తిప్పని నాయకురాలు తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ రాక్షసుడు, దుష్టుడు రాష్ట్రాన్ని నాశనం చేసిండని మండిపడ్డారు. డిసెంబర్ 3న తెలంగాణకు పట్టిన చీడ విరగడయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాతముత్తాతల పేర్లు చెప్పుకుని  సీఎం కుర్చీలో కూర్చోలేదన్నారు.