నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి : వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.

సీఎం వంద రోజుల పాలనకు ఆకర్షితులై మండలంలోని మన్నెవారిపల్లి, ఘన్​పూర్​ ఎంపీటీసీలు చంద్రకళ రవీందర్, హరిలాల్​తో పాటు సతీశ్, నరసింహ, మోతీలాల్  
సోమవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. మోపతయ్య, గోపాల్ రెడ్డి, అంజనేయులు, రాహుల్​ రెడ్డి పాల్గొన్నారు.