తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి భార్య, కుమార్తె ఇతర కుటుంబ సభ్యులు. 2024, అక్టోబర్ 30వ తేదీ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సతీమణితోపాటు కుమార్తె, అల్లుడు, మనవడు, ఇతర బంధువులు స్వామి వారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. 

ALSO READ : ఆ రోజు తిరుమలలో VIP బ్రేక్ దర్శనం రద్దు

ఉదయం సుప్రభాతం అనంతరం.. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.