మక్తల్​ మండల కేంద్రంలో .. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

నారాయణపేట/మక్తల్, వెలుగు: ముదిరాజ్ లను బీసీ–డి నుంచి బీసీ– ఎ గ్రూప్ లోకి మార్చడంతో పాటు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో, కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్​ మండల కేంద్రంలో సీఎం రేవంత్​రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. 

స్వీట్లు పంచి పెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. పాలమూరు ఎంపీగా వంశీచంద్​రెడ్డితో పాటు మెదక్​ నుంచి పోటీ చేస్తున్న నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సంఘ నేతలు పేర్కొన్నారు. సరాఫ్  నాగరాజు, కాంతి కుమార్, కొనంగేరి హన్మంతు, అన్పూర్ సునీల్, జనార్ధన్, మారుతి, బాలగారి రంజిత్, మూలింటి రాజు, యాద్గిర్  అంజి, ఆనంద్, గణేశ్ కుమార్, రాజప్ప గౌడ్, కట్ట సురేశ్ కుమార్ గుప్తా, రవికుమార్  తదితరులు పాల్గొన్నారు.