ఈ స్టూడెంట్ పాటకు సీఎం రేవంత్ రెడ్డి ఫిదా..

 రంగారెడ్డి జిల్లా చిలుకూరులో సీఎం కార్యక్రమంలో ఓ విద్యార్థి పాడిన పాట అందరిని ఆకట్టుకుంది. సర్కారు స్కూళ్లు, చదువు ప్రాధాన్యతను వివరిస్తూ పాట పాడాడు స్టూడెంట్. విద్యార్థి పాడిన పాటకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. చప్పట్టు కొట్టి అభినందించార సీఎం రేవంత్.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చిల్కూరు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. 

గురుకుల విద్యార్థులకు అత్యున్నతమైన మెనూ అందిస్తున్నామని సీఎం అన్నారు. నెలలో ఒక్కో వారానికి ఒక్కో మెనూ చొప్పున రెండు సార్లు చికెన్, రెండు సార్లు మటన్ ఇస్తున్నట్లు తెలిపారు. గురుకులాల్లో గత 16 ఏళ్లుగా కాస్మొటిక్ ఛార్జీలు పెంచలేదని, తమ ప్రభుత్వం 200 శాతం పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెస్ ఛార్జీలను 40 శాతం పెంచామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత భారీగా ఛార్జీలు పెంచడం ఇదే మొదటి సారి అని గుర్తు చేశారు.