విద్యార్థులకు షూ పంపిణీ చేసిన సీఎం రేవంత్

జడ్చర్లలోని  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల  విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.  

జడ్చర్ల నియోజకవర్గంలో 27వేల మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా షూ అందిస్తున్నారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఈ  సందర్బంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని  సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.