కేరళపై సంఘ్​పరివార్ కుట్ర.. సీఎం పినరయి విజయన్ ఆరోపణ

  • మహారాష్ట్ర మంత్రి నితీశ్​ రాణెపై ఫైర్

న్యూఢిల్లీ: బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణె.. కేరళను ‘మినీ పాకిస్తాన్’ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం పినరయి విజయన్ ఫైర్ అయ్యారు. రాణె చేసిన కామెంట్లు ఎంతో హానికరమైనవి అని మండిపడ్డారు. కేరళపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రతిబింబిస్తున్నదని అన్నారు. లౌకికవాదం, మతసామరస్యానికి పునాది అయిన కేరళకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ చేస్తున్న ద్వేషపూరిత కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ కుట్రను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులు ఏకం కావాలని సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణె.. ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ మినీ పాకిస్తాన్ అయిన కేరళలోని వయనాడ్ నుంచి ఎన్నికయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.