ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద ఈ ఏడాదికి గాను అర్హులైన ఈబీసీ మహిళల అకౌంట్లలో రూ.15000 జమ చేయనున్నట్లు తెలిపింది. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు కర్నూలులో పర్యటించిన జగన్ లా యూనివర్సిటీ సహా [పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను ప్రారంభించారు.
వైఎస్సార్ ఈబీసీ పధకంలో భాగంగా రెడ్డిఎం కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసి వర్గాలకు చెందిన అర్హులైన 45ఏళ్ళ నుండి 60ఏళ్ళలోపు మహిళలకు ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటిదాకా మూడు విడతల్లో 1877కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లలో జమ అయ్యింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. పెదాలను ఆదుకునేందుకు పాలకులకు మనసు ఉండాలని అన్నారు. ఎక్కడా కూడా కులం,మతం, ప్రాంతం చూడలేదని అన్నారు. మ్యానిఫెస్టాలో లేకపోయినా ఈ పథకాన్ని అమలు చేశామని అన్నారు.