తప్పు ఎవ్వరు చేసినా తప్పే..ఎవరినీ వదిలిపెట్టం

తప్పు ఎవ్వరు చేసినా తప్పే..ఎవరినీ వదిలిపెట్టం
రాజకీయాలకు దేవుళ్లను వాడుకుంటున్నారన్నారు ఏపీ సీఎం జగన్. విగ్రహాలను ధ్వంసం చేసిన వారే మరుసటి రోజు రచ్చ చేస్తున్నారని.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ముందురోజే విగ్రహాల ద్వంసం జరుగుతోందని, ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి ఏం లాభం పొందుతారని ప్రశ్నించారు. తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు జగన్.  ఇకపై ఏటా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తామన్నారు. తప్పు ఎవ్వరు చేసినా తప్పేనని.. విగ్రహాల ద్వంసం చేసిన వారిని వదిలిపెట్టమని చెప్పారు. కులాలు, మతాలను రెచ్చగొట్టి.. రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దన్నారు జగన్. ఆ ఇంటికి రూ.3 కోట్లు ఎక్కడివి?.. ఊర్మిళపై కంగన ఫైర్