2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి అక్కా చెల్లెళ్లు రాఖీ కట్టాలంటూ.. బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించాలని ఎమ్మిగనూరు సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు. రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులను మోసం చేశారంటూ.. రైతులను మోసం చేసే పార్టీలకు మద్దతిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ. 67, 500 ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రైతులు అండగా ఉండాలని కోరారు. రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యత్ అందించామన్నారు.
వైసీపీ హయాంలో విద్యారంగాన్ని ఎంతో అభివృద్ది చేశామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వద్దన్న పార్టీలకు బుద్ది చెప్పాలని ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ అన్నారు. వైసీపీ హయాంలో చట్టం చేసి 50 శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకు కల్పించాన్నారు. చంద్రబాబుకు ఏపీ లో నా అని పిలుచుకునే వర్గాలు లేవు.. ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్న వారికి సమాధులు కట్టండి.. చంద్రబాబుకు మద్దతిచ్చే వర్గం పక్క రాష్ట్రంలో ఉంది. మైనార్టీ రిజర్వేషన్లను పణంగా పెట్టిన వారిని సమర్దిస్తారా.. 2014 లో రంగు రంగుల మ్యానిఫెస్టోతో భ్రమలు కల్పించారు.. 2014లో నిరుద్యోగ భృతి ఇచ్చారా.. అని ప్రశ్నించారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ కొత్త హామీలతో మరోసారి మోసం చేయడానికి టీడీపీ కూటమి సిద్దమయిందని సీఎం జగన్ అన్నారు. కూటమిని ఓడించేందుకు నేను సిద్దంగా ఉన్నా.. మీరంతా సిద్దమేనా అడిగారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపెయినర్ గా మారి .. చంద్రబాబు లాంటి మోసగాళ్లను నమ్మవద్దని చెప్పాలన్నారు. మంచి చేశాం.. మంచిని చూపించి ప్రజల వద్దకు వెళుతున్నామన్నారు. మంచి జరిగిందని నమ్మితే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి... విలువలకు , విశ్వసనీయతకు అండగా ఉండాలన్నారు.