బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్

చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదని నంద్యాల సభలో సీఎం జగన్​ అన్నారు.  వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు వస్తే కరువు వస్తుందని సీఎం జగన్​ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే కరువు కాటకాలు, బషీర్​ బాగ్​ కాల్నులు  గుర్తొస్తాయన్నారు. 2014 లో రంగురంగుల హామీలు ఇచ్చారన్నారు.  ఆడబిడ్డ పుడితే రూ. 24 వేలు ఇస్తామన్నారు.. ఒక్కరూపాయి ఇచ్చారా .... రైతు రుణమాఫీ.. డ్వాక్రా రుణాలు మాఫీలు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు.   సూపర్​ సిక్స్​ అంటూ మళ్లీ కొత్త హామీలు ప్రకటిస్తున్నారన్నారు.

పేదల బతుకుల్లో మార్పు కోసమే నా ఆరాటం అని సీఎం జగన్​ అన్నారు. పేదల గుండెల్లో నాకు చోటు లభించింది అదే నాకు పెద్ద బహుమతి.  చంద్రబాబు పొత్తులను, మోసాలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు.  వైసీపీ ప్రజల అభివృద్దికి  రాజకీయం చేస్తుందన్నారు.   బాబు చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం అని ప్రశ్నించారు.  మరో అధర్మ, ధర్మ యుద్దానికి రడీ కావలసిన టైం వచ్చిందన్నారు.  గత పాలనకు.. వైసీపీ పాలనకు తేడా గమనించాలని కోరారు.