డబుల్ సెంచరీ సర్కార్ను ఏర్పాటు చేసేందుకు ప్రజలంతాసిద్ధంగా ఉన్నారని నంద్యాల సభలో సీఎం జగన్ అన్నారు. గతంలో చంద్రబాబు అబద్దాలు .చూశాం.. మోసాలు చూశామన్నారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిసి... మళ్లీ నారావారి పాలన తీసుకొస్తామంటున్నారు.. దానిని అడ్డుకోవడానికి ప్రజలంతా సిద్దం అంటున్నారు. సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి. ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు.. దత్తపుత్రుడు.. బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.
పేదలను మళ్లీ చీకట్లోకి నెట్టేందుకు ప్రత్యర్థులు పొత్తు పెట్టుకున్నారు..పొత్తు, కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలన్నారు. జగన్ ఓడించేందుకు తోడేళ్లు అన్నీ ఏకమయ్యాయన్నారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలు.. 25కి25 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. ఈ ఎన్నికలు మనకు జైత్రయాత్ర అన్నారు. బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళుతుందన్నారు, మంత్రి వర్గంలో 48 శాతం మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇచ్చామన్నారు. అగ్ర వర్ణాల్లోని పేదలకు కూడా అవకాశం ఇచ్చామన్నారు. పొత్తుల మారి.. జిత్తుల మారి పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఐదేళ్లలో చేసిన ఇంటింటి ప్రగతిని మరో ఐదేళ్లు ముందుకు తీసుకెళ్తానన్నారు సీఎం జగన్. ఐదేళ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. మ్యానిఫెస్టోలో99 శాతం హామీలను అమలు చేశామన్నారు. గత ప్రభుత్వం మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేశాయన్నారు. నష్ట పోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. ఐదేళ్లలో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలాంటి పథకాలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.