వాలంటీర్ల వ్యవస్థపైనే తొలి సంతకం - జగన్ 

ఏపీలో వాలంటీర్ వార్ అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ చిచ్చు రగిలిస్తోంది.రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యం  వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంటివద్దకు పెన్షన్ రాకపోవటంతో వృద్దులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ అందలేదని కొంతమంది, పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ వడదెబ్బకు గురై మరికొంత మంది వృద్దులు ప్రాణాలు వదులుతున్నారు.

ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొంటున్న జగన్ వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మీదనే సీఎంగా తన తోలి సంతకం ఉండనుందని అన్నారు.  ఈ క్రమంలో సీఎం జగన్ ప్రకటన పట్ల వాలంటీర్లు, వృద్దులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సభలో మాట్లాడిన జగన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు లాగా మోసాలు చేయటం తనకు చేతకాదని, సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో చెబుతానని, మేనిఫెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేస్తానని అన్నారు సీఎం జగన్.