మనం వస్తేనే వాలంటీర్లు మళ్ళీ ఇంటింటికీ వస్తారు...సీఎం జగన్

ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. తమ ప్రభుత్వం వస్తేనే వాలంటీర్లు మళ్ళీ ఇంటింటికి వస్తారని అన్నారు. గత 58నెలల్లో 130సార్లు బటన్ నొక్కి నేరుగా ప్రజల కాటాలో డబ్బులు వేశామని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని అన్నారు.

ప్రతి జిల్లాకు ఒక హైటెక్ సిటీ కడతానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కేసుల సమానంగా జరిగిందని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని, బాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరే నిర్ణయించుకున్నట్లే అని అన్నారు జగన్.