చంద్రబాబు పొత్తులతో ఎందుకు పాకులాడుతున్నాడని మేదరమెట్ల సిద్దం సభలో సీఎం జగన్ ప్రశ్నించారు. వాళ్ల వెనుక ప్రజలు లేరని.. అందుకే అరడజను పార్టీలతో వస్తున్నారన్నారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు అటువైపు ఉన్నాయన్నారు. ఏపీలో సైకిల్ చక్రం తిరగడం లేదని... అందుకే ఢిల్లీలో దత్తపుత్రుడితో మోకరిల్లుతున్నాడు. పొత్తులు.. ఎత్తులు.. జిత్తులతో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి... జగన్... చంద్రబాబు గుండెల్లో... రైళ్లు పరిగెత్తించకపోతే .. పొత్తుల కోసం ఎందుకు ఇన్ని అగచాట్లు .. చంద్రబాబు సైకిల్ కు ట్యూబ్ లేదు... టైర్ లేదు.. తుప్పుపట్టింది.. సైకిల్ చక్రం తిరగడం లేదు.. అందుకే ఢిల్లీలో మోకరిల్లుతున్నాడు. తుప్పు పట్టిన సైకిల్ నుతోయడానికి ఇతర పార్టీల అవసరాన్ని చంద్రబాబు తీసుకున్నాడని జగన్ అన్నారు.
ALSO READ :- కేటీఆర్ కండకావరమెక్కి మాట్లాడుతున్నాడు: బండి సంజయ్
చంద్రబాబు ఏం చేయమంటే దత్తపుత్రుడు అది చేస్తాడని అన్నారు. ప్యాకేజి ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. 2014లో మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మళ్లీ పొత్తుల డ్రామాతో చంద్రబాబు వస్తున్నాడని అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని సీఎం జగన్ అన్నారు. ఈ పార్టీలకు సైన్యాధిపతులే ఉన్నారు కాని.. సైన్యం లేరన్నారు.