శనివారం విజయవాడలో జరిగిన రాళ్ల దాడి తర్వాత సీఎం జగన్ మొదటిసారి బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఈ సభలో ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఇలాంటి దాడుల వల్ల తన సంకల్పం చెక్కు చెదరదని, నుదిటి మీద అయిన గాయం తన సంకల్పాన్ని మరింత బలపరిచిందని అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబుపై మండి పడ్డారు. అర్జునుడి మీద ఒక్క బాణం పడినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదని అన్నారు.
మోసాలు చేయటం, వెన్నుపోటు పొడవటం బాబు నైజం అని, ప్రజలకు మంచి చేయటం, సేవ చేయటం జగన్ నైజం అని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బ తింటుందని కోర్టు మెట్లు ఎక్కి చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు ఒక్క మంచి కూడా జరగలేదని అన్నారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు సీఎం జగన్.