రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశాడు... సీఎం జగన్

2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశాడని అన్నారు. అనకాపల్లిలో వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే అతను సీఎం గా ఉన్నప్పుడు చేసిన మోసాలు, వంచన, దగామాత్రమే గుర్తొస్తాయని అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని అన్నారు. ఆయన దత్తపుత్రుడు పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం,మాయని మచ్చ, కార్లు మార్చినట్లు భార్యలను మార్చటం గుర్తొస్తాయని పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు.

విలువలు లేని ఈ ఇద్దరు కలిసి 2014లో సంతకాలు చేసి ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం పొదుపు సంఘాల రుణమాఫీ మీద చేస్తానని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని అన్నారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.