ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖీలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని, ఓటు అడగటానికి వస్తే నిలదీయాలని ప్రజలను కోరారు. మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఆర్కేతో మాట్లాడి మంగళగిరి స్థానాన్ని చేనేత మహిళ అయిన లావణ్యకు ఇచ్చామని అన్నారు.
కుప్పం, మంగళగిరి రెండు స్థానాలు బీసీ స్థనాలని, ఈ స్థానాల్లో బిసిలకు ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ లు పోటీ చేస్తున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వంలో నేతన్నల కోసం 3వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు జగన్. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని అన్నారు. ఒక సెంటు స్థలం కానీ, ఒక పక్కా ఇల్లు కానీ కట్టించి ఇవ్వలేదని అన్నారు.