విజన్ విశాఖ కార్యక్రమంలో సీఎం జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖనే రాజధానిగా ఉంటుందని, ఇక్కడి నుండే పాలన కొనసాగిస్తామని, మళ్లీ గెలిచి ఇక్కడి నుండే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. అమరావతిని ఉద్దేశించి మాట్లాడుతూ అమరావతి ప్రాంతం కేవలం వేల ఎకరాల బీడు భూములు ఉన్న ప్రాంతం మాత్రమే అని, అమరావతిని రాజధాని చేయాలంటే రోడ్లు, కరెంటు, నీటి వసతి వంటి కనీస మౌలిక సదుపాయాల దగ్గర నుండి మొదలు పెట్టాలని అన్నారు.
అమరావతిలో వేల ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో, చంద్రబాబు బినామీల చేతుల్లో ఉన్నాయని అన్నారు. అమరావతితో పోలిస్తే విశాఖకు అభివృద్ధి అవకాశాలు ఎక్కువున్నాయని అన్నారు. భవిషయత్తులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో సమానంగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
స్వార్థంతో కూడిన ప్రతి పక్షం వల్ల విశాఖ మాత్రమే కాకుండా రాష్ట్రం కూడా వెనుకబడిందని అన్నారు. కోర్టులకు పోయి విశాఖ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. వారి కుట్రలకు మద్దతు పలికే బలమైన ఎల్లో మీడియా ఉండటం మన దురదృష్టం అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూరలు చేసే ప్రతిపక్షంతో వారికి మద్దతు పలికే ఎల్లో మీడియాతో పోరాడాల్సి వస్తోందని అన్నారు.