ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు జిల్లాలో బస్సు యాత్ర ద్వారా సీఎం పర్యటించారు.
ఇక, కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని శనివారం అనంతపురం జిల్లాలోకి సీఎం బస్సు యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం గుత్తిలో జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో సీఎం జగన్ ను చూసేందుకు భారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. దారి పొడువున సీఎం జగన్ కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. సాయంత్రం ధర్మవరం నియోజకవర్గ పరిధిలో యాత్ర ముగియనుంది.