కాలువలోపడిఇద్దరు, ఇంటిపైనుంచిపడి మరొకరి మృతి గ్యాస్లీకైన ఘటనలో 11 మంది మృతి చెందినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్ వెల్లడించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ఉన్నారు. మృతులను కుందన్ శ్రేయ (6), ఎన్. గ్రీష్మ (9), చంద్రమౌళి (19), నారాయణమ్మ (35); అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73), రత్నాల గంగాధర్ (64), గంగాధర్తో పాటు మరో ఇద్దరిని గుర్తించారు. చంద్రమౌళి అనే మృతుడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మృతుల్లో ఒకరుగ్యాస్ పీల్చిన తర్వాత కండ్ల మంటల కారణంగా అదుపుతప్పి బావిలో పడి చనిపోయారు. మరో ఇద్దరు కాలువలో పడి, మరొకరు బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయారు. ఈ గ్యాస్ ప్రభావానికి గురైన 200 మందికి పైగా వేర్వేరు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, వీరిలో సుమారు 30 మంది పరిస్థితి విషమంగా ఉందని ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్ చెప్పారు. 80 మందికి పైగా వెంటిలేటర్లపై ఉన్నారని పేర్కొన్నారు.
ఒక్కోకుటుంబానికి కోటి పరిహారం:
జగన్ గ్యాస్ లీకై న విషయం తెలియగానే ఏపీ సీఎం జగన్ వెంటనే అధికారులను అలర్ట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఆయన విశాఖకు చేరుకొని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇది దురదృష్టకరమని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీ రిపోర్ట్ఆధారంగా చర్యలు ఉంటాయన్నా రు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో అలారమ్ ఎందుకు మోగలేదో తెలుసుకుంటున్నామని చెప్పారు. ఫ్యాక్టరీలో కెమికల్ ఎక్కువరోజులు నిల్వ ఉంచుకోవడం వల్లగ్యాస్ లీకైందన్నా రు. మరణించినవారి కుటుంబాలకు కంపెనీ తరఫున ఎంత రాబట్టాలో అంత రాబట్టడానికి ప్రయత్నిస్తా మని పేర్కొన్నారు.
