కరోనా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. కొన్ని డెడ్ బాడీలు అనాధ శవాలుగా మారిపోతున్నాయి. దీంతో అంత్యక్రియలపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేలా రూ.15వేలు ఆర్ధికసాయం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా వైరస్ తో ఆస్పత్రికి వస్తే ట్రీట్మెంట్ చేయాలని లేదంటే ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
