రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ స్థాపిస్తామని, జిల్లాకో స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అన్నారు. విశాఖలో జరిగిన భవిత కార్యక్రమంలో ఈ మేరకు హామీ ఇచ్చారు. విద్యారంగంలో జగన్ సర్కార్ తెచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించిన ఆయన మూడో తరగతి నుండే టోఫెల్ శిక్షణ ఇస్తున్నామని, మూడో తరగతి నుండే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చామని అన్నారు. స్కిల్ కాలేజెస్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి, చదువు పూర్తైన వెంటనే ఉద్యోగం వచ్చేలా చేస్తామని అన్నారు.
విజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సీఎం జగన్. 2024 ఎన్నికల తర్వాత విశాఖనే రాజధానిగా ఉంటుందని, మళ్లీ గెలిచి విశాఖ నుండే ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్వార్థపూరిత ప్రతిపక్షం, దానికి మద్దతుగా ఉన్న ఎల్లో మీడియా వల్ల విశాఖ మాత్రమే కాకుండా రాష్ట్రం కూడా వెనుకబడిందని అన్నాడు. అమరావతితో పోలిస్తే, రాజధానిఆ అభివృద్ధి చెందే అవకాశం విశాఖకే ఎక్కువ ఉందని అన్నారు. ఈ క్రమంలో విశాఖ రాజధాని అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.