చెన్నైలో తగ్గిన మెట్రో ఛార్జీలు

చెన్నైలో తగ్గిన మెట్రో ఛార్జీలు

ప్రయాణికులకు శుభవార్త చెప్పింది చెన్నై మెట్రో.  ఇకపై మెట్రో ఛార్జీలు తగ్గనున్నట్లు తెలిపింది. గరిష్టంగా ఉన్న ప్రయాణపు టిక్కెట్ ఛార్జీ రూ. 70ని రూ. 50కి తగ్గించనున్నారు. కనిష్ట టిక్కెట్టు ధర రూ. 10గా ఉండనుంది. సవరించిన ఈ ధరలు ఫిబ్రవరి 22 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది తమిళనాడు సర్కారు.  చెన్నై మెట్రో ఇటీవల అత్యధిక శాతం ప్రయాణికులను ఆకర్షించేందుకు టిక్కెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించింది. చైన్నై మెట్రోలో ప్రతీరోజూ 1.2 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే లాక్‌ డౌన్ తర్వాత మెట్రో సేవలు ప్రారంభించినప్పటికీ ప్రయాణికుల సంఖ్య ఆశించినత మేరకు పెరగలేదు.

చెన్నై మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టిక్కెట్టు ధరలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య పెరగనుంది. అలాగే వివిధ మెట్రో స్టేషన్‌లలో షేర్ ఆటోలను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా సవరించిన మెట్రో ఛార్జీలు ఇలా ఉన్నాయి.

0-2 కిలోమీటర్ల వరకు రూ. 10

2-5 కిలోమీటర్ల వరకు రూ. 20

5-12 కిలోమీటర్ల వరకూ రూ. 30

12 నుంచి 21 కిలోమీటర్ల వరకూ రూ. 40

21 నుంచి 32 కిలోమీటర్ల వరకూ రూ. 50