ఉత్సాహంగా సీఎం కప్ టార్చ్ రిలే

పాలమూరు, వెలుగు : జిల్లా కేంద్రంలో ఆదివారం చేపట్టిన సీఎం కప్  టార్చ్  రిలే రన్​ ఉత్సాహంగా సాగింది. ఆదివారం స్టేడియం నుంచి టార్చ్  రిలేను కలెక్టర్  విజయేందిర బోయి, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్రీడా జ్యోతితో ముందుసాగారు. మెయిన్  స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్, జడ్పీ ఆఫీస్, న్యూటౌన్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా మెట్టుగడ్డ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో భాగస్వాములు కావాలన్నారు. మున్సిపల్  చైర్మన్  ఆనంద్ కుమార్  గౌడ్, గ్రంథాలయ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్. శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్  సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎన్పీ వెంకటేశ్, కురుమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు జాకీర్  పాల్గొన్నారు.