డిసెంబర్​7 నుంచి సీఎం కప్

హైదరాబాద్, వెలుగు : సీఎం కప్​2024 క్రీడా పోటీలు డిసెంబర్​7 నుంచి జరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభనువెలుగులోకి తేవడమే లక్ష్యంగా స్పోర్ట్స్​అథారిటీ తెలంగాణ ఆధ్వర్యంలో నాలుగు దశల్లో నిర్వహించే ఈ పోటీల షెడ్యూల్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.  డిసెంబర్ 7, 8 తేదీల్లో గ్రామ స్థాయి, 10–12 వరకు మండల స్థాయి,  16– 21 వరకు జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయి. 

జిల్లా స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.  డిసెంబర్ 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు హైదరాబాద్‌ వేదికగా ఏడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తారు.