అధికారులను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు... పోలవరంపై స్పెషల్ ఫోకస్

2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్డీయే కూటమి తరఫున సీఎంగా ఏపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు పాలన ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండే పలు శాఖలకు సంబంధించి సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు పోలవరంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని డిసైడ్ అయ్యారు.

2014 నుండి 2019వరకు తన హయాంలో ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే తరహాలో సమీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మరల చక చక ముందుకు సాగాలని జల వనరుల శాఖ అధికారులు కు సూచించారు చంద్రబాబు. తన హయాంలో పోలవరం పనులు 72శాతం పూర్తికాగా, గత ప్రభుత్వ హయాంలో 10శాతం కూడా పూర్తి కాలేదని అన్నారు చంద్రబాబు.రాష్ట్రంలోని మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా అధికారులు దృష్టి పెట్టి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.