చంద్రబాబు తమ్ముడు ఆరోగ్యం విషమం : హైదరాబాద్ కు మంత్రి లోకేష్

సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెసులుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి నారా లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.

ALSO READ : కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు నోటీసులు

నారా రామ్మూర్తినాయుడు 1952లో  నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో రోహిత్‌ కాగా.. మరొకరు నారా గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు రామ్మూర్తి నాయుడు.