సంక్రాంతి నాటికి రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‎లో సంక్రాంతి పండుగ నాటికి రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దని.. అన్ని గుంతలు పూడ్చాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు. 2024, నవంబర్ 2 శనివారం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని మాజీ సీఎం జగన్‎ను విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రోడ్లపై నాట్లు వేయడం, చేపలు పట్టిన దుస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రోడ్లపై ఎస్కోబార్ పెట్టిన గుంతలు పూడ్చడానికే రూ.860 కోట్లు అవుతాయని తెలిపారు. వైసీపీ హాయాంలో నరకానికి మార్గాలుగా రహదారులను మార్చారని ధ్వజమెత్తారు.  ఓ పక్కా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఏపీలో మాత్రం రోడ్లు ఇలా ఉన్నాయంటే దానికి కారణం ఎవరని అన్నారు. అలాంటి ఎస్కోబార్ మనకు వద్దని.. అభివృద్ధే మనకు కావాలన్నారు. జనవరి నాటికి గుంతలు లేని రోడ్లు తయారు చేస్తామని.. ప్రణాళికబద్ధంగా ఐదేళ్లలో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు.

Also Read : కర్నూలులో యురేనియం వివాదం

 విశాఖ నుండి అమరావతికి రెండు గంటల్లో చేరుకునేలా చేస్తామని అన్నారు. క్రాంటాక్టర్లకు లక్ష కోట్ల బకాయిలు పెట్టిపోయారు. పదిలక్షల కోట్లకు పైగ అప్పులు చేశారు. చివరకు ప్రభుత్వ ఆఫీసులకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లు రాష్ట్రంలో స్వేచ్ఛగా నవ్వుకున్న పరిస్థితులు కూడా లేవు.. ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇప్పుడు పరదాలు లేవు, చెట్లు  నరకడం లేదని అన్నారు.