జగన్ అమరావతిని ఎడారిగా మార్చేశారు: సీఎం చంద్రబాబు

అమరావతిలోని తాళ్లయిపాలెంలో జీఐఎస్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన ప్రభుత్వం విధ్వంసం చేసిందని.. జగన్ అమరావతిని ఎడారిగా మార్చేశారని మండిపడ్డారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ ను నాశనం చేశారని, ఎక్కడ దొరికితే అక్కడ రూ.10 లక్షల కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. 20ఏళ్ళు మద్యం తాకట్టు పెట్టి అప్పు చేశారని అన్నారు.

అమరావతిని కాపాడిన ఘనత ఆడబిడ్డలదే అని అన్నారు. పేదలపై విద్యుత్ భారానికి కారణం గత ప్రభుత్వమేనని అన్నారు చంద్రబాబు. ఒక్క యూనిట్ విద్యుత్ కూడా వాడకుండానే వేల కోట్లు చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐదేళ్ళలో విద్యుత్ సంస్థల్లో రూ.1 లక్ష 20వేల కోట్లు అప్పు చేశారని అన్నారు.

9 సార్లు కరెంటు చార్జీలు పెంచి రూ. 36 వేల కోట్లు భారం వేశారని అన్నారు. పోలవరం, కృష్ణపట్నం పవర్ ప్లాంట్లను నిర్వీర్యం చేశారని.. ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి దుర్మార్గులకు కూడా అధికారం వస్తుందని అన్నారు. ఐదేళ్ళలో విద్యుత్ సంస్థల్లో రూ.1 లక్ష 20వేల కోట్లు అప్పు చేశారని అన్నారు.