కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు..సీఎంకు ఆహ్వాన పత్రిక

  • సీఎంకు ఆహ్వాన పత్రిక అందించిన ఎమ్మెల్యేలు

చిన్నచింతకుంట, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం ఎనుముల రేవంత్​రెడ్డిని దేవరకద్ర, మక్తల్​ ఎమ్మెల్యేలు జి.మధుసూదన్​ రెడ్డి, వాటికి శ్రీహరి కోరారు. ఆలయ చైర్మన్  గోవర్దన్ రెడ్డి, ఈవో మధనేశ్వర్​రెడ్డితో కలిసి శుక్రవారం సీఎంను కలిశారు.

బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సీఎంను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా వస్తానని తెలిపారు.