
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతుల ముద్దుల తనయకు 'క్లీంకార కొణిదెల' అనే నామకరణం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుక తరువాత.. పాపాయి ఊయల్లో ఉన్న ఫొటోను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే.. క్లీంకార కొణిదెల అనే పేరు విన్న చాలా మంది ఆ పేరుకు అర్థం ఏంటని తెలుసుకునే పనిలో పడ్డారు.
ఒక్క బుుగ్వేదంలోనే దాదాపు 10 వేల 552 మంత్రాలు ఉన్నాయి. వాటిలో బీజ్ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి మానవుల ఆధ్యాత్మికత, స్పృహ, జ్ఞానోదయం వంటి వాటిని చేకూరుస్తాయి. చాలా ముఖ్యమైన మంత్రాల్లో క్లీం అనేది ఒకటి. ఇది శక్తి సంబంధించిన బీజాక్షరం. ఈ మంత్రం చుట్టూ చాలా ఆకర్షణలు తిరుగుతాయి. హిందువులు, బౌద్ధులు మరియు ఇతర విశ్వాశాలు ప్రేమను సృష్టించేందుకు ఉపయోగించే అనేక పురాతన ఆధ్యాత్మిక ఆచారాలలో క్లీం మంత్రం ఒకటి. ఇది అన్ని కాలాల్లోనూ అత్యంత శక్తివంతమైన మంత్రాలలో క్లీం మంత్రం ఒకటి.
క్లీంకార శక్తి బీజం
క్లీం అనేది అద్భుత శక్తులతో కూడిన బీజ్ మంత్రం. ఇది లలిత సహస్రనామంలోని ఒక మంత్రం. బీజ్ మంత్రాలు సూక్ష్మ శక్తులను సిద్ధించే సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తారు. బీజ్ మంత్రాలు సార్వత్రిక శక్తులను సూచిస్తాయి. క్లీం అనేది అద్భుత శక్తులతో కూడిన.. చాలా ప్రజాదరణ పొందిన బీజ్ మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆధ్యాత్మికంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందేందుకు శక్తివంతంగా పని చేస్తుంది. కాళీదేవి అనుగ్రహం కోసం బీజ్ మంత్రం క్లీంగా చెబుతున్నారు. కాళీ మాత ఆరాధన సమయంలోనూ.. ఈ క్లీం అనే మంత్రాన్ని జపిస్తారు పండితులు.
క్లీం మంత్రం అర్థం
క్లీం మంత్రం దుర్గా లేదా మా కాళిమాత శక్తికి అనుగుణంగా ఉంటుంది. దుర్గా మాత అంశంతో సంబంధం ఉన్నప్పటికీ, క్లీం మంత్రం శక్తివంతమైన ఆకర్షణీయమైన శక్తిని ఇస్తుంది. ఇది ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగిస్తుంది. క్లీం మంత్రాన్ని పఠించడం ద్వారా ఆకర్షణ శక్తి వస్తుందని సామవేదంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని బౌద్ధులు, హిందువులు, ఇతర మతాల ప్రజలు కూడా పఠిస్తారు. ఈ మంత్రాన్ని జపం చేస్తే జీవితంలో విలాసాలను పొందుతారని వేదాలు చెబుతున్నాయి
క్లీం మంత్రం ప్రాముఖ్యత
క్లీం మంత్రం 4 అక్షరాలను కలిగి ఉంటుంది . క్లీం మంత్రంలో క,ల,ఈ, మ అనే నాలుగు అక్షరాలు ఉంటాయి.
క అనగా కారణం
ల అనగా బాహ్య శరీరం
ఈ అనగా కారణ శరీరం
మ అనగా పరిపూర్ణత
ఈ శబ్దాలు ఉన్న ఈమంత్రం జపిస్తే.. ఉన్నత స్థితిని చేరుకుంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
క్లీమ్ మంత్రం ఎలా అద్భుతాలను సృష్టిస్తుంది
ఈ మంత్రాన్ని జపించిన వారి జీవితంలో విలాసాన్ని అనుభవిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. క్లీం మంత్రం ఉన్నత శక్తులను ఆకర్షింప చేస్తుందని స్కందపురాణంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని జపించిన వారికి కారు, ఇల్లు, సంపద, బట్టలు, సమృద్ధి, శ్రేయస్సు పొందడమే కాకుండా స్నేహితులను కూడా ఆకర్షిస్తారు. ఈ మంత్రాన్ని ఏ అనైతిక ప్రయోజనం కోసం ఉపయోగించకూడదు.
క్లీం మంత్రాన్ని ఎలా జపించాలి
•క్లీమ్ మంత్రాన్ని జపించాలి అనుకుంటే.. కనీసం 108 సార్లు చేయాలి. లేదంటే అసలు ప్రారంభించకూడదు.
• గణనను చేయటానికి ధ్యాన మాల ఉండాలి.
• క్లీమ్ మంత్రాన్ని తక్కువ శబ్ధంలో.. లోతైన గొంతు ఉంచి.. ఉచ్చరించాల్సి ఉంటుంది.
• క్లీమ్ మంత్రాన్ని జపించడానికి అనువైన సమయం కూడా ఉంది. తెల్లవారుజాము బ్రహ్మ ముహూర్తంలోనే జపించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.
• ఈ మంత్రాన్ని సమూహంగా జపించినప్పుడు, అది మరింత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.
• వైవాహిక సంబంధాలను మెరుగుపరచడానికి, ఈ మంత్రాన్ని దంపతులు కలిసి జపించవచ్చు. ఇది ప్రభావాన్ని గణనీయంగా పెంచుతుంది.