హైదరాబాద్ లో ఘోరం: నారాయణ స్కూల్ లో 7వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య..

విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిన నారాయణ స్కూల్‎లో చదువుల ఒత్తిడికి మరో విద్యార్థి బలి అయ్యాడు. ప్రెజర్ తట్టుకోలేక 7వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో జరిగింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర శివారులోని హయత్ నగర్‎లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‎లో లోహిత్ అనే విద్యార్థి ఏడవ తరగతి చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా చదువుల ఒత్తిడికి గురి అవుతోన్న లోహిత్.. సోమవారం (డిసెంబర్ 16) స్కూల్ క్యాంపస్ హోస్టల్‎లో ఆత్మహత్మకు పాల్పడ్డాడు. రూమ్‎లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు స్కూల్ సిబ్బందికి సమాచారం అందించారు.

లోహిత్ తండ్రి విద్యార్ధి సంఘాలతో కలిసి కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.లక్షలు ఖర్చు పెడితే నా కొడుకు శవం నాకు గిప్టుగా ఇచ్చారని వాపోయారు తండ్రి. కాలేజి యాజమాన్యం నిర్లక్ష్యం,టీచర్ల వేధింపులు వల్లే లోహిత్ ఆత్మహత్య హత్య చేసుకున్నాడని.. ఇది 
ఆత్మహత్య లేక ఇంకా ఏమైనా చేశారా అనే అనుమానం కూడా ఉందని అన్నారు. తన కొడుకు చనిపోయిన విషయం తనకు ఇప్పటిదాకా చెప్పలేదని అన్నారు. 

నారాయణ కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కొడుకు చదివిన కాడికి చదువుతాడని ఎక్కువగా టార్చర్ పెట్టవద్దని గతంలోనే చెప్పానని అన్నారు. చదువు ఒత్తిడి మాత్రమే కాకుండా ఈ స్కూల్ లో ఇంకా ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు విద్యార్ధి తండ్రి.