సీఎం నితీష్‌‍‌కు బుడ్డోడి మొర.. నాణ్యమైన విద్య అందించండి

సీఎం నితీష్‌‍‌కు బుడ్డోడి మొర.. నాణ్యమైన విద్య అందించండి

సార్.. నాకు నాణ్యమైన విద్య అందించండి... నా విద్యకు ఇవ్వాల్సిన డబ్బులు తాగుడుకు ఖర్చు పెడుతున్నాడు.. సహాయం చేయండి.. అంటూ ధైర్యంగా సీఎం నితీష్‌‌ను ఓ బుడ్డోడు కోరాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే.. బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. సీఎం నితీష్ కుమార్ నలంద జిల్లాలో పర్యటించారు.

ఈ సమయంలో అతని వద్దకు ఆరో తరగతి చదువుతున్న సోనూ కుమార్ విద్యార్థి వచ్చాడు. చేతులు కట్టుకుని.. తన ఆవేదనను సీఎం ఎదుట వ్యక్తపరిచాడు. తన తండ్రి డబ్బంతా మద్యానికి ఖర్చు పెడుతున్నాడని, స్కూల్ ఫీజులకు ఏమి ఇవ్వడం లేదని వాపోయాడు. తనకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. 

అనంతరం విద్యార్థి మీడియాతో మాట్లాడాడు. నాణ్యమైన విద్యను అందించాలని సీఎంను అభ్యర్థించడం జరిగిందని, చదువుకు సరిపడా డబ్బులు తన తండ్రి ఇవ్వడం లేదన్నాడు. తన అభర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారని, మంచి పాఠశాలలో చేర్పించాలని అధికారికి సూచించినట్లు తెలిపాడు. 

మరిన్ని వార్తల కోసం :

సాయి గణేశ్ మృతికి మంత్రి పువ్వాడే కారణం

తుక్కుగూడ సభలో అమిత్ షా అన్ని అబద్దాలే చెప్పారు