శ్రీశైలం సరిహద్దుల విషయంలో..ఫారెస్ట్‌‌‌‌, ఆలయ ఆఫీసర్ల మధ్య గొడవ

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలంలో సరిహద్దు ఏర్పాటు విషయంలో దేవస్థానం, ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్ల వివాదం నెలకొంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల శ్రీశైలంలో భూ సర్వే నిర్వహించి దేవస్థానానికి సుమారు 5,400 ఎకరాల భూమి ఉందని నిర్ధారించింది. అయితే ల్యాండ్‌‌‌‌ ఎంకరేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు శనివారం శ్రీశైలంలోని టోల్‌‌‌‌గేట్‌‌‌‌ వద్ద రోడ్డుకు అడ్డంగా గుంతలు తీసి సరిహద్దు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఆఫీసర్లకు చెప్పకపోవడంతో విషయం తెలుసుకున్న వారు టోల్‌‌‌‌గేట్‌‌‌‌ వద్దకు చేరుకున్నారు.

తమకు సమాచారం ఇవ్వకుండా, దేవస్థానం పరిధిలోని స్థలంలో గుంతలు ఎలా తీస్తారని ఆలయ ఆఫీసర్లు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భక్తులను ఇబ్బందులకు గురి చేసేలా ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తమ డ్యూటీని సక్రమంగానే చేస్తున్నామని, ఆలయ ఆఫీసర్లే అనవసరంగా వాగ్వాదానికి దిగుతున్నారని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు శాఖల ఆఫీసర్లతో మాట్లాడారు. పూర్తి సర్వే రిపోర్ట్‌‌‌‌ వచ్చే వరకు ఎలాంటి పనులు చేయొద్దని సీఐ రెండు శాఖల ఆఫీసర్లను ఒప్పించడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది.