పొట్టు పొట్టు కొట్టుకున్న మూడు ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు

ప్రకాశం: అందరూ ఇండ్లలో దీపావళి పండుగ జరుపుకుంటుంటే.. వీళ్లు మాత్రం గ్రూపులుగా ఏర్పడి రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‎లోని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో జరిగింది. వివరాల ప్రకారం.. ఏ1 గ్లోబల్, ఇందిరా, జార్జి.. మూడు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఏదో విషయంలో వివాదం తలెత్తింది. ఈ గొడవ మరింత ముదరడంతో గురువారం (అక్టోబర్ 31) దరిమడుగు సమీపంలో మూడు కాలేజీల ఇంజనీరింగ్ విద్యార్థులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. రహదారిపైనే గ్రూపులుగా ఏర్పడి దాడులు కొట్టుకున్నారు. 

ALSO READ | హైదరాబాద్ కీ షాన్.. తెలంగాణలో మరో పండగ..సదర్ ఉత్సవం

ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులు కురిపించుకున్నారు. సమాచారం అందుకున్న కాలేజీ యాజమాన్యాలు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను కంట్రోల్ చేశారు. విద్యార్థుల మధ్య వివాదానికి దారి తీసిన పరిస్థితులు ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. మూడు కాలేజీలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల రోడ్డుపైన ఘర్షణకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. బుద్ధిగా చదువుకోండని తల్లిదండ్రులు పంపిస్తే.. వీళ్లేమో వీధి రౌడీల్లా వర్గాలుగా ఏర్పడి దాడులు చేసుకుంటున్నారని స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.