రూ.1500 పంపకాల్లో లొల్లి.. కానిస్టేబుల్ సస్పెన్షన్, వీఆర్ కు హోంగార్డు అటాచ్

  • సూర్యాపేట జిల్లాలో  ఘటన

సూర్యాపేట:  న్యూ ఇయర్  సెలబ్రేషన్లకు సంబంధించి వసూలు చేసిన మాముళ్లు  ఒక్కరే వాడుకోవడంతో  పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఖాకీలు పిడిగుద్దులు కురిపించిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది.  పీఎస్​లో కానిస్టేబుల్ జాటోత్ రవికు మార్, హోంగార్డు గంజి  శ్రీనుకు కలసి డిసెంబర్ 28న మండల కేంద్రాన్ని ఓ టీ స్టాల్ యజమాని న్యూ ఇయర్​ రోజు దావత్ చేసుకోమని ఇద్దరికీ కలిపి రూ. 1,500 ఇచ్చాడు.  ఈ డబ్బులను  రవికుమార్ ఒక్కడే వాడు కోవడంతో  ఇద్దరి మధ్య స్టేషన్​లో గొడవ జరిగింది. 

ALSO READ | బీసీలను అన్యాయం చేసి గొంతు కోసిండ్రు.. బీఆర్ఎస్‎పై మహేష్ గౌడ్ ఫైర్

మాటల యుద్ధం పెరిగి పిడిగుద్దుల ఘర్షణకు దాకా పోయింది.  పీఎస్​లో ఇద్దరి పోలీసుల మధ్య జరిగిన తగాదా బయటకు రావడంతో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వారిపై చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ రవికుమార్ సస్పెండ్ చేయగా.హోంగార్డు శ్రీను వీఆర్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.