బాధితులు, నిందితులపై న్యాయవ్యవస్థకు అవగాహన ఉండాలి

బాధితులు, నిందితులపై న్యాయవ్యవస్థకు అవగాహన ఉండాలి

న్యాయవ్యవస్థ కార్యకలాపాలు ప్రజలతో ముడిపడి ఉంటాయన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. బాధితులు, నిందితులపై న్యాయవ్యవస్థకు అవగాహన ఉండాలని అభిప్రాయపడ్డారు. చట్టం మానవీయంగా పనిచేయాలని అన్నారు. పాన్ ఇండియా లీగల్ అవేర్ నెస్, ఔట్ రీచ్ క్యాంపైన్ ముగింపు వేడుకల్లో ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఏ విషయంలోనైనా అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయవ్యవస్థ ఆశాకిరణంగా కనిపిస్తుందన్నారు. భారత రాజ్యాంగం అప్పగించిన గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధిగా నిర్వహించాలని న్యాయమూర్తులకు సూచించారు ఎన్వీ రమణ.