మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యం : చుక్క రాములు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు: మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని న్యూలాండ్​ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు రూ.14 వేల వేతన ఒప్పందం జరిగిన సందర్భంగా ఆదివారం కార్మికులందరూ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చుక్కరాములు హాజరై మాట్లాడారు.

కార్మికుల ఐక్యతతోనే  న్యూ లాండ్ పరిశ్రమలో చారిత్రాత్మకమైన వేతన ఒప్పందం చేయడానికి వీలైందన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులకు లాభం చేకూర్చేల వేతనంతో పాటు, వీడీఏ పెంచడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధించడం గొప్ప విషయమన్నారు.  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య, యూనియన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్, నాయకులు శ్రీధర్లు పాల్గొన్నారు.