రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

జడ్చర్ల, వెలుగు:  పోలేపల్లి సెజ్​లో ఎవర్​ ట్రోజన్​ కంపెనీలో డ్యూటీ చేసి బైక్​పై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్​లో చనిపోయిన పసుపుల చంద్రశేఖర్  ఫ్యామిలీకి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి సీఐటీయూ నాయకులు కంపెనీ గేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. మృతుడి భార్యకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య, బాగి కృష్ణ య్య పాల్గొన్నారు. యాక్సిడెంట్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు​సీఐ ఆదిరెడ్డి తెలిపారు.